శ్రీ సుబ్రహ్మణ్య, వల్లీ, దేవసేనా కళ్యాణ ప్రవరలు – Sri Subrahmanya, Valli, Devasena Kalyana Pravara

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర గోత్రప్రవర
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు | నిర్గుణ నిరంజన నిర్వికల్ప పరశివ గోత్రస్య | పరశివ శర్మణో నప్త్రే | సదాశివ శర్మణః పౌత్రాయ | విశ్వేశ్వర శర్మణః పుత్రాయ | అఖిలాండకోటిబ్రహ్మాండనాయకాయ | త్రిభువనాధీశ్వరాయ | తత్త్వాతీతాయ | ఆర్తత్రాణపరాయణాయ | శ్రీసుబ్రహ్మణ్యేశ్వరాయ వరాయ ||

శ్రీ వల్లీదేవి గోత్రప్రవర
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు | కాశ్యప ఆవత్సార నైధృవ త్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రస్య | జరత్కార శర్మణో నప్త్రీమ్ | ఆస్తీక శర్మణః పౌత్రీమ్ |
శంఖపాల శర్మణః పుత్రీమ్ | సకలసద్గుణసంపన్నాం శ్రీవల్లీ నామ్నీం కన్యామ్ ||

[* పాఠంతరంపరావరణ చిదానంద పరాకాశ పరవాసుదేవ గోత్రస్య | విశ్వంభర శర్మణో నప్త్రీమ్ | పరబ్రహ్మ శర్మణః పౌత్రీమ్ | కశ్యప శర్మణః పుత్రీమ్ | *]

శ్రీ దేవసేనాదేవి గోత్రప్రవర
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు | భార్గవ చ్యావన ఆప్నవాన ఔర్వ జామదగ్న్య పంచార్షేయ ప్రవరాన్విత శ్రీవత్సస గోత్రస్య | యూధప శర్మణో నప్త్రీమ్ | మాధవ శర్మణః పౌత్రీమ్ | ఇంద్ర శర్మణః పుత్రీమ్ | సకలసద్గుణసంపన్నాం శ్రీదేవసేనా నామ్నీం కన్యామ్ ||